విశాఖలో తీవ్ర విషాదం.. నలుగురు చిన్నారులు మృతి
దిశ, ఏపీ బ్యూరో : విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన వి.మాడుగుల మండలం జమ్మాదేవిపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎల్.గవరవరం గ్రామానికి చెందిన జాహ్నవి (11), జాన్సీ (8), షర్మిల (7), మహీందర్ (7) సోమవారం మధ్నాహం పెద్దేరు వాగు దాటుతున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు చిన్నారులు నీట మునిగిపోయారు. నీరు ఎక్కువగా రావడంతో […]
దిశ, ఏపీ బ్యూరో : విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన వి.మాడుగుల మండలం జమ్మాదేవిపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎల్.గవరవరం గ్రామానికి చెందిన జాహ్నవి (11), జాన్సీ (8), షర్మిల (7), మహీందర్ (7) సోమవారం మధ్నాహం పెద్దేరు వాగు దాటుతున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు చిన్నారులు నీట మునిగిపోయారు.
నీరు ఎక్కువగా రావడంతో వాగు పొంగిపొర్లుతోంది. దీంతో చిన్నారులు కొట్టుకుపోయారు. చిన్నారులు వాగులో కొట్టుకుపోయారన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నలుగురు చిన్నారులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఎల్.గవరవరంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి.
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నలుగురు చిన్నారులు గిరిజన కుటుంబాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలోనూ విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.