పాత బస్తీలో దారుణం.. నలుగురు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్
దిశ, జల్‌పల్లి : నలుగురు పిల్లలతో కలిసి ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన నగరంలోని పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. వాదియే ముస్తఫాకు చెందిన మహ్మద్ సాలెం పహాడి షరీఫ్విలేజ్చార్మినార్ మజీద్ప్రాంతానికి చెందిన జైనం బేగం(28)ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలదు. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 12గంటల సమయంలో భర్త మహ్మద్సాలెంతో జైనం బేగం గొడవపడి మహ్మద్అబ్దుల్ఖాద్(9), హర్ష […]
దిశ, జల్‌పల్లి : నలుగురు పిల్లలతో కలిసి ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన నగరంలోని పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. వాదియే ముస్తఫాకు చెందిన మహ్మద్ సాలెం పహాడి షరీఫ్విలేజ్చార్మినార్ మజీద్ప్రాంతానికి చెందిన జైనం బేగం(28)ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలదు. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 12గంటల సమయంలో భర్త మహ్మద్సాలెంతో జైనం బేగం గొడవపడి మహ్మద్అబ్దుల్ఖాద్(9), హర్ష (8), జునెత్ (6), జుబేద్(5)లతో కలిసి చార్మినార్మజీద్ ప్రాంతంలో నివసించే సోదరి భవాని ఇంటికి వచ్చింది. తిరిగి సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లలతో కలిసి జైనం బేగం ఇంటికి వెళ్తున్నానని సోదరితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. రాత్రి అయినా పిల్లలతో కలిసి బయలుదేరిన జైనం బేగం ఇంటికి చేరుకోకపోవడంతో సోదరి భవాని.. భర్త మహ్మద్సాలెంపై అనుమానం వ్యక్తం చేస్తూ పహాడిషరీఫ్పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.