నోబెల్ శాంతి రేసులో డొనాల్డ్ ట్రంప్

న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి నామినేషన్‌ల రేసులో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలువురు ఉన్నారు. పర్యావరణ అంశంపై గ్రెటా థన్‌బెర్గ్, డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకోవడం గమనార్హం. నార్వే చట్టసభ్యుల ఆమోదమూ థన్‌బెర్గ్, నావల్నీ, డబ్ల్యూహెచ్‌వోకు ఉన్నట్టు తెలిసింది. పర్యావరణ సమస్యపై గళమెత్తుతున్నారని థన్‌బెర్గ్‌ను, రష్యాను శాంతియుతంగా ప్రజాస్వామ్య దేశంగా మార్చడంలో […]

Update: 2021-01-31 05:30 GMT

న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి నామినేషన్‌ల రేసులో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలువురు ఉన్నారు. పర్యావరణ అంశంపై గ్రెటా థన్‌బెర్గ్, డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకోవడం గమనార్హం. నార్వే చట్టసభ్యుల ఆమోదమూ థన్‌బెర్గ్, నావల్నీ, డబ్ల్యూహెచ్‌వోకు ఉన్నట్టు తెలిసింది. పర్యావరణ సమస్యపై గళమెత్తుతున్నారని థన్‌బెర్గ్‌ను, రష్యాను శాంతియుతంగా ప్రజాస్వామ్య దేశంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని నావల్నీపై నార్వే చట్టసభ్యులు అభిప్రాయపడుతున్నారు. శాంతి బహుమతి కోసం ప్రపంచవ్యాప్త చట్టసభ్యులు, లేదా మాజీ విన్నర్లు నామినేషన్‌లను ప్రతిపాదించవచ్చు. కానీ, నామినీల పేర్లు సాధారణంగా బహిరంగపరచరు. నోబెల్ శాంతి విజేతలను నార్వే నోబెల్ కమిటీ నిర్ణయిస్తుంది. విజేతలను అక్టోబర్‌లో ప్రకటిస్తారు.

Tags:    

Similar News