సునీల్ జోషి.. క్రికెట్ జోష్!

భారత జట్టు మాజీ స్పిన్నర్, హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కోచ్ ‘సునీల్ జోషి’ టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహా మండలి (సీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరో సెలెక్టర్‌గా హర్వీందర్ సింగ్‌ను నియమించింది. మదన్ లాల్ నేతృత్వంలోని సీఏసీలో ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్ సభ్యులుగా ఉన్నారు. సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో సునీల్ జోషి, సెంట్రల్ జోన్ నుంచి గగన్ ఖోడా స్థానంలో […]

Update: 2020-03-05 04:14 GMT

భారత జట్టు మాజీ స్పిన్నర్, హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కోచ్ ‘సునీల్ జోషి’ టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహా మండలి (సీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరో సెలెక్టర్‌గా హర్వీందర్ సింగ్‌ను నియమించింది. మదన్ లాల్ నేతృత్వంలోని సీఏసీలో ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్ సభ్యులుగా ఉన్నారు. సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో సునీల్ జోషి, సెంట్రల్ జోన్ నుంచి గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్‌ను సెలెక్టర్లుగా నియమించారు. అంతే కాకుండా సునీల్ జోషికి సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటికే వెస్ట్ జోన్ నుంచి జతిన్ పరాంజమే, ఈస్ట్ జోన్ నుంచి దేవాంగ్ గాంధీ, నార్త్ జోన్ నుంచి శరణ్‌దీప్ సింగ్ సెలెక్టర్లుగా ఉన్నారు. వీరి పదవీకాలం కూడా మరో ఆరునెలల్లో ముగియనుంది. ఇంటర్వ్యూలో సునీల్ జోషి చక్కని ప్రతిభ కనబరిచాడని.. అతడి సమాధానాలన్నీ సీఏసీ సభ్యులను సంతృప్తి పరిచాయని మదన్ లాల్ స్పష్టం చేశారు. ఇక సీఏసీ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్లలో జోషి, హర్వీందర్‌తో పాటు మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, రాజేష్ చౌహాన్, లక్ష్మణ్ శివరామకృష్ణన్ కూడా ఉన్నారు. ఇక సెలెక్టర్లుగా నియమింపబడతారని అందరూ ఊహించిన అజిత్ అగార్కర్, నయన్ మోంగియాల పేరు కనీసం షార్ట్ లిస్ట్‌లో కూడా లేకపోవడం గమనార్హం.

సునీల్ జోషీ ఇండియా తరపున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 41, వన్డేల్లో 69 వికెట్లు తీసుకున్నాడు. గతంలో హైదరాబాద్ రంజీ జట్టు కోచ్‌గా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిగా పని చేసిన అనుభవం ఉంది.

tags : Chief selector, Sunil Joshi, Harvinder singh, BCCI, CAC

Tags:    

Similar News