లోయలో పడి మాజీ క్రికెటర్ మృతి

దిశ, స్పోర్ట్స్ : మహారాష్ట్ర మాజీ రంజీ క్రికెటర్ శేఖర్ గావ్లీ నాసిక్ జిల్లాలోని ఒక లోయలో పడి మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. శేఖర్ గావ్లీ నాసిక్ సమీపంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఇగతపురి హిల్ స్టేషన్‌కు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. మంగళవారం సాయంత్రం తన స్నేహితులతో కలసి ట్రెక్కింగ్ చేస్తుండగా కాలు జారి 250 అడుగు లోతులోని లోయలో పడిపోయారు. అప్పటి నుంచి అతని కోసం గాలించగా చివరకు బుధవారం ఉదయం […]

Update: 2020-09-02 06:25 GMT

దిశ, స్పోర్ట్స్ : మహారాష్ట్ర మాజీ రంజీ క్రికెటర్ శేఖర్ గావ్లీ నాసిక్ జిల్లాలోని ఒక లోయలో పడి మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. శేఖర్ గావ్లీ నాసిక్ సమీపంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఇగతపురి హిల్ స్టేషన్‌కు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. మంగళవారం సాయంత్రం తన స్నేహితులతో కలసి ట్రెక్కింగ్ చేస్తుండగా కాలు జారి 250 అడుగు లోతులోని లోయలో పడిపోయారు. అప్పటి నుంచి అతని కోసం గాలించగా చివరకు బుధవారం ఉదయం అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని బంధువులకు అప్పగించారు. ‘ఒక ఘోర దుర్ఘటనలో మా మాజీ రంజీ ఆటగాడు, ప్రస్తుతం మహారాష్ట్ర జట్టు ట్రెయినర్ శేఖర్ గావ్లీ చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగును గాక’ అని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ట్వీట్ చేసింది. మహారాష్ట్ర తరపున రెండు రంజీ మ్యాచ్‌లు ఆడిన గావ్లీ మూడు వికెట్లు తీశారు.

https://twitter.com/MaharashtraCric/status/1301045664055357440

Tags:    

Similar News