ధోనీకి మద్దతుగా నిలిచిన ఆఫ్రీది
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనుకున్న మేర రాణించకపోవడంతో.. సోషల్ మీడియా వేదికగా పలువురు ధోనిపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ధోని కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేగాకుండా ధోని కూతురు జీవాను రేప్ చేస్తామని, ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్లు చేశాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది స్పందించి, ధోనికి మద్దతుగా నిలిచాడు. ‘ధోనికి, అతనికి కుటుంబానికి ఎలాంటి బెదిరింపులు వచ్చాయో నాకు తెలియదు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనుకున్న మేర రాణించకపోవడంతో.. సోషల్ మీడియా వేదికగా పలువురు ధోనిపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ధోని కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేగాకుండా ధోని కూతురు జీవాను రేప్ చేస్తామని, ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్లు చేశాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది స్పందించి, ధోనికి మద్దతుగా నిలిచాడు. ‘ధోనికి, అతనికి కుటుంబానికి ఎలాంటి బెదిరింపులు వచ్చాయో నాకు తెలియదు. కానీ ఇలా చేయడం సరైనది కాదు. భవిష్యత్తులో ఇలా జరగకూడదు. భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన వ్యక్తి ధోని. ధోని తన ప్రయాణంలో సీనియర్లు, జూనియర్లను కలుపుకుని ముందుకుసాగాడు.. అతనికి ఇలాంటి విధంగా జరగకూడదు’ ట్విట్టర్ వేదికగా ఆఫ్రిది ధోనికి మద్దతుగా ట్వీట్ చేశాడు.