‘బ్యాంక్ ఈఎంఐ చెల్లింపులు వాయిదా వేయాలి’

దిశ, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు రెండు నెలలపాటు బ్యాంక్ ఈఎంఐల చెల్లింపులు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా నివారణ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రతి నెలా రుణాలకు చెల్లించే […]

Update: 2020-03-17 02:17 GMT

దిశ, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు రెండు నెలలపాటు బ్యాంక్ ఈఎంఐల చెల్లింపులు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా నివారణ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రతి నెలా రుణాలకు చెల్లించే ఈఎంఐలను రెండు నెలలు వాయిదా వేయాలన్నారు. కరోనా నివారణకు టెస్ట్ అండ్ రెస్ట్ పద్ధతిలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్‌ను కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఐసోలేషన్ వార్డులకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ప్రైవేట్ పాలీ క్లీనిక్‌లలో పరీక్షలకు అనుమతి ఇవ్వాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని వ్యాధి లక్షణాలు నిర్ధారణ చేసేందుకు ప్రముఖ హోటల్లో ఉంచాలని సూచించారు.

Tags: Former MP boora Narsaiah Goud, Press Meet, farmers, Bank loans, postponed, corona virus

Tags:    

Similar News