నా కార్యకర్తలకు కంటికి రెప్పలా చూసుకుంటా : కొమ్మూరి

దిశ, జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని, ఉంటే గత ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జనగామ జిల్లా భజనపేట మండలం పడమటి కేశవాపూర్ గ్రామంలో ‘జన చైతన్య యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాతో కలిసి నడిచే […]

Update: 2021-09-12 06:46 GMT

దిశ, జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని, ఉంటే గత ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జనగామ జిల్లా భజనపేట మండలం పడమటి కేశవాపూర్ గ్రామంలో ‘జన చైతన్య యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాతో కలిసి నడిచే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటానని ధైర్యం చెప్పారు. దళితులకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. దళితుల పట్ల ముఖ్యమంత్రికి అంత ప్రేమ ఉంటే ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితులు అభివృద్ధి చెందింది కేవలం దివంగత నేత వైఎస్ఆర్ హయాంలోనే అని తెలిపారు.

ప్రస్తుతం.. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటోందని అన్నారు. రేవంత్ రెడ్డి ఎంపికతో కేసీఆర్‌కు వెన్నులో భయం పట్టుకున్నదని అన్నారు. ఈ యాత్రలో సర్పంచ్ గిదేల రమేష్, మాజీ ఎంపీపీ ఆరుగొండ పరుశషరాములు, మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, మాజీ సర్పంచ్ జంగిటి నాంపల్లి, మత్స్యశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజె మల్లేశం, జంగిటి విద్యానాథ్, వార్డు సభ్యులు కాయిత వినయ్, చల్లా సంతోష్ రెడ్డి, గిద్దెల మౌనిక, భాస్కర్, గ్రామశాఖ అధ్యక్షుడు యాసరణి వెంకటేష్, కాటం మల్లేషం, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి, కురుమ సంఘం నాయకులు చిగుళ్ల రాములు, కాయిత నర్సింహా రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాయిత ఐలయ్య, మాజీ ఉప సర్పంచ్ ఐలయ్య, ఉట్లపల్లి శ్రీనివాస్, బుట్టి యాదగిరి, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News