కులాల వారీగా వేతనాలు.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

దిశ, మిర్యాలగూడ: ఉపాధి కూలీ పెంచాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ‘కులాల వారీగా వేతనాలు’ అనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న కూలీలను కులాల వారీగా విభజించడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవటమేనన్నారు. పని చేయగలిగే ప్రతిఒక్కరికీ కుల, మత, ప్రాంత, లింగ వివక్ష లేకుండా పని కల్పించాలని కోరారు. దళితుల అభివృద్ధి నిధులు, […]

Update: 2021-07-15 07:52 GMT

దిశ, మిర్యాలగూడ: ఉపాధి కూలీ పెంచాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ‘కులాల వారీగా వేతనాలు’ అనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న కూలీలను కులాల వారీగా విభజించడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవటమేనన్నారు. పని చేయగలిగే ప్రతిఒక్కరికీ కుల, మత, ప్రాంత, లింగ వివక్ష లేకుండా పని కల్పించాలని కోరారు. దళితుల అభివృద్ధి నిధులు, వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని పాలకులను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారి ఐలయ్య, రేమెడల భిక్షం, నాయకులు డబ్బికార్ మల్లేశ్, జగదీశ్ చంద్ర, పాలడుగు ప్రభావతి, రవినాయక్, పరశురాములు, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్దన తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News