కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి: జూపల్లి
దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూర్, అంకిరావుపల్లి, యన్మన్‌బెట్ల, చింతలపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం పర్యటిస్తూ గ్రామ చౌరస్తాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. పుకార్లను నమ్మి భయాందోళనకు గురవ్వొద్దనీ, వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడక్కోవాలనీ, మాస్కులు వాడాలని సూచించారు. అలాగే, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని కోరారు. Tags: […]
దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూర్, అంకిరావుపల్లి, యన్మన్‌బెట్ల, చింతలపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం పర్యటిస్తూ గ్రామ చౌరస్తాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. పుకార్లను నమ్మి భయాందోళనకు గురవ్వొద్దనీ, వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడక్కోవాలనీ, మాస్కులు వాడాలని సూచించారు. అలాగే, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని కోరారు.
Tags: former minister jupally, people, Awareness, corona, mahabubnagar