పోలీసులు.. చొక్కాలేని టీఆర్ఎస్ కార్యకర్తలు
దిశ, నల్లగొండ: ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తిరిగి నన్ను పంపించాడని, ప్రజల అశీర్వాదంతోనే ప్రమాదం నుంచి బతికి బయటపడ్డానని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి ప్రతి కార్యకర్తనూ ఆదుకుంటానని, ఇప్పటివరకూ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఏనాడూ విమర్శించలేదన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో గెలిచి జగదీశ్ రెడ్డి మంత్రి అయ్యారని, నైతిక విజయం నాదేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో […]
దిశ, నల్లగొండ: ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తిరిగి నన్ను పంపించాడని, ప్రజల అశీర్వాదంతోనే ప్రమాదం నుంచి బతికి బయటపడ్డానని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి ప్రతి కార్యకర్తనూ ఆదుకుంటానని, ఇప్పటివరకూ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఏనాడూ విమర్శించలేదన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో గెలిచి జగదీశ్ రెడ్డి మంత్రి అయ్యారని, నైతిక విజయం నాదేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సూర్యాపేటలో కరోనా నిర్మూలనలో విఫలమైన మంత్రి జగదీష్ రెడ్డిని కేసీఆర్ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తన కార్యకర్తలకు అన్యాయం జరిగితే లక్ష మందితో పోలీసు స్టేషన్ల ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చడం అమానుషమని అన్నారు. పోలీసులు చొక్కాలేని టీఆర్ఎస్ కార్యకర్తలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.