బీజేపీలోకి ముద్రగడ పద్మనాభం ?
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల వరకు ఏపీలో బలంగా పుంజుకోవాలని ప్లాన్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను శనివారం బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు కలిసి.. కాషాయ కండువా కప్పుకోవాలని ఆహ్వానించారు. అంతేగాక రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై కూడా చర్చించారు. ముద్రగడ బీజేపీలో చేరితే కీలక బాధ్యతలను […]
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల వరకు ఏపీలో బలంగా పుంజుకోవాలని ప్లాన్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను శనివారం బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు కలిసి.. కాషాయ కండువా కప్పుకోవాలని ఆహ్వానించారు. అంతేగాక రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై కూడా చర్చించారు. ముద్రగడ బీజేపీలో చేరితే కీలక బాధ్యతలను సైతం ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముద్రగడను కలిసిన విషయాన్ని సోము వీర్రాజు ట్విట్టర్‌లో తెలిపినా.. బీజేపీలో చేరికపై ముద్రగడ పద్మనాభం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాలపై ముద్రగడ ఏవిధమైన స్టెప్ తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.