మాజీ మంత్రి మహ్మద్‌ జానీ కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి మంత్రి మహ్మద్‌ జానీ(74) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. గుంటూరుకు చెందిన మహ్మద్ జానీ రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీ పని చేశారు. 1985 నుండి 1989 వరకు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో శాసనమండలిలో డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2010లో ఆనాటి ముఖ్యమంత్రి […]

Update: 2021-04-17 23:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి మంత్రి మహ్మద్‌ జానీ(74) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. గుంటూరుకు చెందిన మహ్మద్ జానీ రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీ పని చేశారు. 1985 నుండి 1989 వరకు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో శాసనమండలిలో డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2010లో ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో తిరిగి శాసనమండలికి ఎన్నికై 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2017లో టీడీపీలో చేరి రెండేళ్ల పాటు టీడీపీలో కొనసాగారు. తిరిగి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఏడాది కిత్రమే ఆయన మృతిచెందారు.

Tags:    

Similar News