సంతలో పశువుల్లా అమ్ముడుపోయారు.. కేసీఆర్ నాతో రా చూపిస్తా..!
దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో పొలిటికల్ పార్టీల మధ్య రాజకీయం హీటెక్కింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా, బీజేపీ తరఫున ఎవరూ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. విద్యుత్, తాగునీరు, మౌలిక సౌకర్యాలు కల్పించడంలో హస్తం పార్టీ ఫెయిల్ అయిందని, ఈసారి సాగర్ బైపోల్‌లో కారు జోరు చూపిస్తామని వ్యాఖ్యానించారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో పొలిటికల్ పార్టీల మధ్య రాజకీయం హీటెక్కింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా, బీజేపీ తరఫున ఎవరూ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. విద్యుత్, తాగునీరు, మౌలిక సౌకర్యాలు కల్పించడంలో హస్తం పార్టీ ఫెయిల్ అయిందని, ఈసారి సాగర్ బైపోల్‌లో కారు జోరు చూపిస్తామని వ్యాఖ్యానించారు.
దీనిపై మాజీ మంత్రి జానారెడ్డి స్పందిస్తూ.. కారు పార్టీ నేతలపై మండిపడ్డారు. ‘సీఎం కేసీఆర్ నాతో వస్తే నాగార్జున సాగర్‌లో జరిగిన అభివృద్ధి చూపిస్తానన్నారు. తమ హయాంలో నీళ్లు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని కేసీఆర్ స్పందిస్తే తీసుకెళ్లి చూపిస్తానని చెప్పారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సంతల్లో పశువుల్లా అమ్ముడుపోయారని’ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తంచేశారు.