ఈటల చూపు కాంగ్రెస్ వైపేనా..? భట్టితో భేటీకి అదే కారణమా?

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చించారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ తర్వాత పలు పార్టీల నేతలు ఈటల రాజేందర్​ను కలుస్తుండగా… తాజాగా ఆయన భట్టీ ఇంటికి వెళ్లి కలువడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను అన్ని పార్టీల నేతలను […]

Update: 2021-05-11 13:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చించారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ తర్వాత పలు పార్టీల నేతలు ఈటల రాజేందర్​ను కలుస్తుండగా… తాజాగా ఆయన భట్టీ ఇంటికి వెళ్లి కలువడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ లీడర్ల వరకూ అందరితోనూ చర్చిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం మాత్రం రాజకీయ చర్చల్లో భాగంగానే భట్టిని కూడా కలిసినట్లు ఈటల చెప్పారు.

కాంగ్రెసే బెటరా..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పొలిటికల్ ప్లాన్​ఇప్పుడు గందరగోళానికి దారి తీస్తోంది. ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తున్నారు. మొన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డే ఈటల ఇంటికి వెళ్లి మంతనాలు జరపగా మంగళవారం ఈటలే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి కలిశారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం కమలం పార్టీ అని మొన్నటి వరకు అనుకున్నా… దాని కన్నా కాంగ్రెసే బెటర్ అనే అభిప్రాయం తాజాగా నెలకొంది. దీనికి తోడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుణ్ని తమ పార్టీలోకి తీసుకోబోమని బీజేపీ స్టేట్​ చీఫ్​బండి సంజయ్ కుమార్ గతంలో వ్యాఖ్యానించారు. దీంతో ఈటల రాజేందర్ తదుపరి ప్రయాణం హస్తం పార్టీతోనేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.

అంతేకాకుండా దేవరయాంజాల్​భూముల్లో టీఆర్ఎస్ నేతల భూకబ్జాలపై బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా పోరాటం చేస్తోంది. ఎంపీ రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి అధికార పార్టీ లీడర్ల అక్రమాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా టీఆర్ఎస్ పార్టీ నేతల భూకబ్జాలపై గాంధీభవన్​లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అటు వీహెచ్, ఉత్తమ్​కూడా మంత్రి మల్లారెడ్డిని టార్గెట్​చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేసినా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్​కే ఆ ఘనత దక్కుతుందని రాజకీయ చర్చ. సీఎం కేసీఆర్​ను ఎదుర్కోవటానికి ఇదే బలమైన పాయింట్​ అని, దీన్నిబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే రాష్ట్రంలో హస్తం పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయం ఉంది. కాంగ్రెస్​లాగే బీజేపీ కూడా జాతీయ పార్టీయే అయినా దానికి మతతత్వ పార్టీ అనే ముద్ర ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీ బెటర్​అనే అభిప్రాయాలున్నట్లు చెప్పుకుంటున్నారు.

కరోనా నేపథ్యంలో కేంద్రంలో బీజేపీకి గతేడాది నుంచి గడ్డు పరిస్థితులు ఉండటం, ప్రధాని మోడీ ప్రభావం తగ్గిపోతున్న పరిణామాల్లో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్​పార్టీలో చేరుతారని కొత్త చర్చ మొదలైంది. దీనిలో భాగంగానే ఈటల… సీఎల్పీ భట్టితో సమావేశమయ్యారని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News