అది ముఖ్యమంత్రికి అలవాటే.. బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, ఆందోల్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటే అని ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి పి.బాబుమోహన్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్వహించబోయే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసమే బండి సంజయ్ యాత్ర చేపడుతున్నారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకొచ్చిన […]

Update: 2021-08-27 07:22 GMT

దిశ, ఆందోల్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటే అని ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి పి.బాబుమోహన్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్వహించబోయే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసమే బండి సంజయ్ యాత్ర చేపడుతున్నారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకొచ్చిన ‘దళితబంధు’ పథకం అక్కడ టీఆర్ఎస్ గెలిస్తేనే కొనసాగుతుందని, ఓడిపోతే ఉత్తిదే అని ఎద్దేవా చేశారు. రైతుబంధు మాదిరిగానే ‘దళితబంధు’ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్లో దళితులకు రూ.100 కోట్లు కేటాయించి, దళితుల కోసం ఖర్చు పెట్టామని చెప్పిన సీఎం కేసీఆర్ ఏడేండ్ల నుంచి ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పడం లేదని విమర్శించారు. జోగిపేట మున్సిపల్ భవనం కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించానని, అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియదని, అసంపూర్తి పనులు చేసిన కాంట్రాక్టర్‌కు రూ.16 లక్షలు చెల్లించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి మొన్న అధికారంలోకి వచ్చి ఆ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలని మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను అంధోల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 29న జరిగే సమావేశంలో నియోజకవర్గంలో పాదయాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్ వస్తుందని ఆయన తెలిపారు. 6,7,8 తేదీల్లో నియోజకవర్గంలోకి పాదయాత్ర వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు గమనించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు హరినారాయణ వర్మ, ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు నవీన్, శేఖర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు సాయి, నాయకులు జగన్నాథం, కొత్త శ్రీనివాస్, సుమన్, వెంకటరమణ, బాలయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News