‘ఈకో టి కాలింగ్’ బుక్ ఆవిష్కరణ : కేటీఆర్

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి రాసిన ‘ఈకో టి కాలింగ్ -టువర్డ్స్ పీపుల్స్ సెంట్రిక్ గవర్నెన్స్’ అనే పుస్తకాన్ని శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తన సుదీర్ఘకాల ఉద్యోగ జీవితంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడం అద్భుతమని మంత్రి కేటీఆర్‌కు జోషి వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజలకు అనుగుణంగా కొనసాగుతూ వస్తున్నదని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన అనుభవాలను […]

Update: 2020-07-10 06:34 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి రాసిన ‘ఈకో టి కాలింగ్ -టువర్డ్స్ పీపుల్స్ సెంట్రిక్ గవర్నెన్స్’ అనే పుస్తకాన్ని శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తన సుదీర్ఘకాల ఉద్యోగ జీవితంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడం అద్భుతమని మంత్రి కేటీఆర్‌కు జోషి వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజలకు అనుగుణంగా కొనసాగుతూ వస్తున్నదని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పేర్కొన్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన ఎస్కే జోషి తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావడం, ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ పుస్తకంలో పొందుపరచడం ప్రశంసనీయమన్నారు. ఈ పుస్తకం కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తమకు మాత్రమే కాకుండా, ప్రభుత్వంలో పనిచేస్తున్న అనేక మంది అధికారులకు కూడా స్పూర్తినిచ్చేలా ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన ఎస్కే జోషి ప్రస్తుతం ఈ పుస్తకం ద్వారా భవిష్యత్ తరాలకు తమ పరిపాలనను పుస్తక రూపంలో అందించారని మంత్రి కేటీఆర్ వివరించారు. తక్కువ కాలంలోనే ఇంత మంచి పుస్తకాన్ని తీసుకువచ్చిన ఎస్ కే జోషీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:    

Similar News