షాకింగ్ న్యూస్ : మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చరిత్రను బయటపెట్టిన రేవంత్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : ఐఏఎస్ అధికారి ముసుగులో సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్‌కు బంట్రోతుగా పని చేశారని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌కు వెంకట్రామిరెడ్డి కార్యకర్త కంటే ఎక్కువగా పని చేశారని ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామి‌రెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ పలు విమర్శలు […]

Update: 2021-11-16 07:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఐఏఎస్ అధికారి ముసుగులో సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్‌కు బంట్రోతుగా పని చేశారని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌కు వెంకట్రామిరెడ్డి కార్యకర్త కంటే ఎక్కువగా పని చేశారని ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామి‌రెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ పలు విమర్శలు చేశారు.

భూముల వ్యవహారంలో టీఆర్ఎస్‌కు అనుకూలం పని చేశాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదని, వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్​ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనుక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని, దీని విచారణ నుంచి అప్పట్లో వెంకట్రామిరెడ్డి తప్పించుకున్నారని రేవంత్​రెడ్డి గుర్తు చేశారు. ఇంకో ఏడాదిలో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన్ను కాపాడేందుకే సీఎం కేసీఆర్ ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీని చేస్తున్నారని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుకుని ముఖ్యమంత్రులందరినీ బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని, ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా కేసీఆర్ నియమించారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందని, అందుకే ఆయనకు ఏ ప్రభుత్వమైనా కీలక బాధ్యతలు అప్పగించిందని ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌కు కూడా నిబంధనలను ఉల్లంఘించిన పని చేశాడని, అందుకే వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాధ్యతలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వివరాలు దొరకడంలేదని పేర్కొన్నారు. భూములతో పాటు పలు అంశాల్లో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన చరిత్ర వెంకట్రామిరెడ్డిదేనని, ఆయనపై హైకోర్టు కూడా జరిమానా విధించిందని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్సీగా గుత్తా నామినేషన్

Tags:    

Similar News