సరైన పద్ధతి కాదు.. టీఆర్ఎస్ నేతలకు జానారెడ్డి వార్నింగ్
దిశ, హాలియా: టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఎన్నో హామీలను అటకెక్కించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. సోమవారం నిడమనూరు మండల కేంద్రంలోని సర్పంచ్ మేరెడ్డి పుష్పలత నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 45 ఏళ్ల నుంచి సామాన్య కార్యకర్తగా, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా […]
దిశ, హాలియా: టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఎన్నో హామీలను అటకెక్కించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. సోమవారం నిడమనూరు మండల కేంద్రంలోని సర్పంచ్ మేరెడ్డి పుష్పలత నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 45 ఏళ్ల నుంచి సామాన్య కార్యకర్తగా, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తనను అనుభవం లేని నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, అది సరైన పద్ధతి కాదన్నారు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చేసిందేమీలేదని, కనీసం ఆరు కిలోమీటర్ల కొత్త రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని, రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. నిడమనూరుకు చెందిన భవన నిర్మాణ కార్మికులు, వేంపాడు గుంటుకాగుడెం, వెంగన్నగుడెం గ్రామాలకు చెందిన ప్రజలు దాదాపు 500 మందికి పైగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.