ఆ రెండు జిల్లాల ఏర్పాటు పూర్తి.. జీవో విడుదల
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బుధవారం సాయంత్రం వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌లు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష పూర్తయిన […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బుధవారం సాయంత్రం వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌లు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష పూర్తయిన మరుసటి రోజే హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.
ఇదీ జిల్లాల స్వరూపం..
హన్మకొండ జిల్లాను 12 మండలాలతో, వరంగల్ జిల్లాలో 15మండలాలతో ఏర్పాటు చేసింది. హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కలుస్తుండగా, స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ధర్మసాగర్, వేలేరు, పరకాల నియోజకవర్గానికి చెందిన పరకాల, నడికూడ, దామెర మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కమాలాపూర్ కలిశాయి. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఐనవోలు, హసన్‌పర్తి మండలాలు కూడా హన్మకొండ జిల్లాలోనే ఉన్నాయి.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో ప్రస్తుత వరంగల్ నియోజకవర్గం మొత్తం ఉంటుంది. పరకాల నియోజకవర్గానికి చెందిన గీసుగొండ, ఆత్మకూరు, శాయంపేట, సంగెం మండలాలు, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వర్ధన్నపేట, పర్వతగిరి, పాలకుర్తి నియోజకవర్గం నుంచి రాయపర్తి, నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ వరంగల్ జిల్లాలో ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వరంగల్, పరకాల రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా కమాలాపూర్ మండలం పరకాల పరిధిలోకి రావడం గమనార్హం. కొత్తగా ఏర్పడబోయే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవిన్యూ డివిజన్లు ఆరు నియోజకవర్గాల సమ్మిళితంతో హన్మకొండ జిల్లా అవతరించింది. ఐదు నియోజకవర్గాల సమ్మిళితంతో, రెండు రెవెన్యూ డివిజన్లు (వరంగల్, నర్సంపేట)తో వరంగల్ జిల్లా అవతరించింది.
హన్మకొండ జిల్లాలోని మండలాలు
- హన్మకొండ
- కాజీపేట
- ఐనవోలు
- హసన్‌పర్తి
- వేలేరు
- ధర్మసాగర్
- ఎల్కతుర్తి
- భీమదేవరపల్లి
- కమాలాపూర్
- పరకాల
- నడికూడ
- దామెర
వరంగల్ జిల్లాలోని మండలాలు
- వరంగల్
- ఖిలావరంగల్
- గీసుగొండ
- ఆత్మకూరు
- శాయంపేట
- వర్ధన్నపేట
- రాయపర్తి
- పర్వతగిరి
- సంగెం
- నర్సంపేట
- చెన్నారావుపేట
- నల్లబెల్లి
- దుగ్గొండి
- ఖానాపూర్
- నెక్కొండ