Allu Arjun : హుటాహుటిన ఆసుపత్రికి బన్నీ.. కారణం ఇదే

టాలీవుడ్(Tollywood) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు.

Update: 2025-03-23 13:13 GMT
Case filed against allu arjun over sri chaitanya advertisement
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్(Tollywood) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యం పాలవగా.. బన్నీ ఆగమేఘాల మీద హాస్పిటల్ వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బన్నీ నాయనమ్మ కనకరత్నం ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ పైన ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అయితే కనకరత్నం వయసు 95 సంవత్సరాలు కావడంతో వృద్ధాప్య సమస్యలు అధికం అయినట్టు సమాచారం. అల్లు అరవింద్(Allu Aravind) కు తల్లి, మెగాస్టార్ చిరంజీవి(Chiranjivi)కి స్వయంగా అత్తగారు కావడంతో మరికాసేపట్లో చిరంజీవి ఫ్యామిలీ ఆసుపత్రిలో కనకరత్నంను పరామర్శించే అవకాశం ఉంది. 

READ MORE ...

Allu Arjun: అబుదాబిలోని నారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఐకాన్ స్టార్.. వీడియో వైరల్


Tags:    

Similar News