విదేశీ ప్రేక్షకులకు అనుమతి లేదు..
దిశ, స్పోర్ట్స్ : టోక్యోలో జరుగనున్న ఒలంపిక్స్‌కు విదేశీ ప్రేక్షకులను అనుమతించేదే లేదని.. క్రీడలు జరిగే సమయంలో జపాన్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (ఐవోసీ), జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ పారాఒలంపిక్ కమిటీ, టోక్యో ఒలంపిక్స్ నిర్వాహక కమిటీ శనివారం ఒక ఆన్‌లైన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది. ఇటీవల విదేశీ ప్రేక్షకులను అనుమతించే విషయంపై ఒక ఆన్‌లైన్ పోల్ నిర్వహించగా.. 80 […]
దిశ, స్పోర్ట్స్ : టోక్యోలో జరుగనున్న ఒలంపిక్స్‌కు విదేశీ ప్రేక్షకులను అనుమతించేదే లేదని.. క్రీడలు జరిగే సమయంలో జపాన్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (ఐవోసీ), జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ పారాఒలంపిక్ కమిటీ, టోక్యో ఒలంపిక్స్ నిర్వాహక కమిటీ శనివారం ఒక ఆన్‌లైన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది.
ఇటీవల విదేశీ ప్రేక్షకులను అనుమతించే విషయంపై ఒక ఆన్‌లైన్ పోల్ నిర్వహించగా.. 80 శాతం జపాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు ఒలంపిక్సే నిర్వహించవద్దని కూడా గట్టిగా కోరారు. ప్రస్తుతం జపాన్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రపంచ దేశాల్లో సెకెండ్ వేవ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే విదేశీ ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారి చెప్పారు.
ఇప్పటి వరకు 6 లక్షల టికెట్లు విదేశీ ప్రేక్షకులకు అమ్మారు. వారందరికీ డబ్బులు రిఫండ్ చేస్తామని నిర్వాహక కమిటీ చెప్పింది. పారా ఒలంపిక్స్‌కు కూడా ఇదే నియమం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయమే. కానీ అథ్లెట్లు, క్రీడాకారులు, జపాన్ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము’ అని ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు.