రోడ్డుకు అటవీశాఖ సర్వే: ఎమ్మెల్యే రేఖా నాయక్
దిశ ఖానాపూర్: దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కడెం మండలంలోని అలంపల్లి గ్రామ రోడ్డుకు మోక్షం వచ్చింది. దశాబ్ద కాలంగా రోడ్డు లేక అక్కడి ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే చాల ఇబ్బందులు పడుతుండేవారు. ఆ గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ ఆ గ్రామనికి రోడ్డు మంజూరు చేయించారు. కానీ అటవీశాఖ అనుమతులు రాక రోడ్డు పనులు జరుగలేదు. రోడ్డు నిర్మాణం కోసం గతంలో ఎమ్మెల్యే రేఖ నాయక్ ముఖ్యమంత్రి […]
దిశ ఖానాపూర్: దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కడెం మండలంలోని అలంపల్లి గ్రామ రోడ్డుకు మోక్షం వచ్చింది. దశాబ్ద కాలంగా రోడ్డు లేక అక్కడి ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే చాల ఇబ్బందులు పడుతుండేవారు. ఆ గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ ఆ గ్రామనికి రోడ్డు మంజూరు చేయించారు. కానీ అటవీశాఖ అనుమతులు రాక రోడ్డు పనులు జరుగలేదు. రోడ్డు నిర్మాణం కోసం గతంలో ఎమ్మెల్యే రేఖ నాయక్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి అటవీశాఖ అనుమతులు కోసం విన్నవించారు. ముఖ్యమంత్రి స్పందించి అటవీశాఖ క్లియరెన్స్ కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శనివారం రోజున పంచాయతీ రాజ్, అటవీశాఖ సెంట్రల్ టీం రోడ్ కోసం సర్వే చేశారు.