హైదరాబాద్‌లో విదేశీ శాస్త్రవేత్తలు

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం ముగింపు దశకు చేరుకోవడంతో వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు హైదరాబాద్‌ బాటపట్టారు. సుమారు ఎనభై దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నగరంలోని భారత్ బయోటెక్, బయొలాజికల్ ఇంజనీరింగ్ సంస్థలను జీనోమ్ వ్యాలీకి వెళ్ళి సందర్శించనున్నారు. ప్రత్యేక విమానంలో వీరంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ, ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు, దేశ అవసరాలకు సరిపోయే స్థాయిలో తయారుచేసే […]

Update: 2020-12-08 23:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం ముగింపు దశకు చేరుకోవడంతో వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు హైదరాబాద్‌ బాటపట్టారు. సుమారు ఎనభై దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నగరంలోని భారత్ బయోటెక్, బయొలాజికల్ ఇంజనీరింగ్ సంస్థలను జీనోమ్ వ్యాలీకి వెళ్ళి సందర్శించనున్నారు. ప్రత్యేక విమానంలో వీరంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ, ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు, దేశ అవసరాలకు సరిపోయే స్థాయిలో తయారుచేసే సామర్థ్యం తదితర అనేక అంశాలపై వీరు ఈ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు మన దేశంలో ఉన్న వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ఆ దేశాలకు చెందిన వైద్య నిపుణులు, వైద్యారోగ్య రంగంలో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు.. ఇలా వంద మందికిపైగా నగరంలో ఈ రెండు సంస్థలను సందర్శించనున్నారు.

హెడ్స్ ఆఫ్ మిషన్ అనే పేరుతో వస్తున్న 80 దేశాలకు చెందిన ప్రతినిధుల్లో అరవై మంది ఆయా దేశాల అంబాసిడర్లు (రాయబారులు) ఉన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, డెన్మార్క్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్… ఇలా చాలా దేశాలకు చెందినవారు ఉన్నారు. స్వయంగా ప్రధాని మోదీ అహ్మదాబాద్, పూణె, హైదరాబాద్ నగరాల పర్యటన చేసిన కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్న సంస్థల ప్రతినిధులతో మాట్లాడడం, ఆ తర్వాత వివిధ దేశాల రాయబారులతో విదేశాంగ శాఖ తాజా పురోగతిని వివరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ హెడ్స్ ఆఫ్ మిషన్ బృందం హైదరాబాద్‌లో పర్యటించడం విశేషం.

Tags:    

Similar News