పరీక్షల భయం.. వైద్య విద్యార్థిని బలవన్మరణం
దిశ, ఏపీ బ్యూరో: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం లేదు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మ, నాన్న క్షమించండి..’ అంటూ లేఖ రాసి ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు గ్రామీణ మండల పరిధిలోని ఓ దంత వైద్య కళాశాలలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా […]
దిశ, ఏపీ బ్యూరో: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం లేదు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మ, నాన్న క్షమించండి..’ అంటూ లేఖ రాసి ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు గ్రామీణ మండల పరిధిలోని ఓ దంత వైద్య కళాశాలలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఎర్రంరెడ్డి లక్ష్మీలాలస(21) బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.
పరీక్షలు సమీపిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి లేఖ రాసి హాస్టల్‌లోని గదిలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించింది. అయితే ఆదివారం ఉదయం స్నేహితులు తలుపులు తట్టగా స్పందన లేకపోవడంతో కిటికీ నుంచి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో కళాశాల యాజమాన్యంకు తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు రూరల్ సీఐ వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని లాలస కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు.