ఎన్నికల కోసం కొవిడ్ రూల్స్ సడలింపు..

దిశ, వెబ్‌డెస్క్ : సమీప భవిష్యత్తులో దేశంలో జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం కొవిడ్ రూల్స్‌ను సడలించింది. బీహార్ సహా ఎన్నికలు జరిగే 12 రాష్ట్రాల్లో రాజకీయ ర్యాలీలను వెంటనే నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. ఈ నెల 15వరకు ఎలాంటి ప్రచార ర్యాలీలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవాళ (గురువారం) సవరించింది. ర్యాలీలు నిర్వహించుకునే సమయంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.

Update: 2020-10-08 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

సమీప భవిష్యత్తులో దేశంలో జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం కొవిడ్ రూల్స్‌ను సడలించింది. బీహార్ సహా ఎన్నికలు జరిగే 12 రాష్ట్రాల్లో రాజకీయ ర్యాలీలను వెంటనే నిర్వహించుకోవచ్చని ప్రకటించింది.

ఈ నెల 15వరకు ఎలాంటి ప్రచార ర్యాలీలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవాళ (గురువారం) సవరించింది. ర్యాలీలు నిర్వహించుకునే సమయంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.

Tags:    

Similar News