శరీరం వేడి చేసిందా.. ఇవి పాటించండి!

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా సీజనల్‌లో కనిపించే వ్యాధి లక్షణాలు నార్మల్ డేస్‌లోనూ కనిపించాయంటే అలాంటి వారికి వేడి చేసిందంటారు. తీసుకునే ఆహార పదార్ధాలు, శరీర తత్వాన్ని వేడి చేయడం అనేది జరుగుతుంది. మమూలుగా కొందరికి జ్వరం వచ్చినపుడు తప్ప మిగతా రోజుల్లో శరీరం నార్మల్ టెంపరేచర్ ఉండి ఆరోగ్యంగా ఉంటారు. వేడి చేసిన వారికి జ్వరం వచ్చినట్లు లక్షణాలు కనిపిస్తాయి కానీ, అది జ్వరం కాదు. బాడీ హీట్‌గా ఉంటుంది. శరీరంలో వెను వెంటనే కొన్ని […]

Update: 2020-10-21 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా సీజనల్‌లో కనిపించే వ్యాధి లక్షణాలు నార్మల్ డేస్‌లోనూ కనిపించాయంటే అలాంటి వారికి వేడి చేసిందంటారు. తీసుకునే ఆహార పదార్ధాలు, శరీర తత్వాన్ని వేడి చేయడం అనేది జరుగుతుంది. మమూలుగా కొందరికి జ్వరం వచ్చినపుడు తప్ప మిగతా రోజుల్లో శరీరం నార్మల్ టెంపరేచర్ ఉండి ఆరోగ్యంగా ఉంటారు. వేడి చేసిన వారికి జ్వరం వచ్చినట్లు లక్షణాలు కనిపిస్తాయి కానీ, అది జ్వరం కాదు. బాడీ హీట్‌గా ఉంటుంది. శరీరంలో వెను వెంటనే కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. అలాంటి వారు తప్పనిసరిగా ఆహార నియమాల్లో పలు జాగ్రత్తలు పాటించాలి. లేనియెడల కొత్త కొత్త అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

వేడి చేస్తే శరీరంలో కలిగే మార్పులు..

వేడి చేసిన వారి శరీరంలో ముందుగా గుర్తించాల్సిన మార్పులు ఎంటంటే.. జలుబు, గొంతునొప్పి, జీర్ణ సమస్యలు, మల, మూత్రనాళాల్లో మంట, అరికాళ్లు, అరిచేతుల్లో మంట, తలనొప్పి, కళ్ల మంటలు, బాడీ పెయిన్స్, ఒంటి నుంచి వేడి అధికంగా రావడం, రక్తహీనత వంటివి జరుగుతాయి. దీనిని సరైన ట్రీట్ మెంట్ తీసుకోకపోయినా, ఆహార నియామాలు పాటించక పోయినా అది కాస్త తీవ్రమై జీవకణాలు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఎం తినొద్దు..

వేడి చేసే శరీరతత్వం ఉన్నవారు తప్పకుండా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా అధికంగా టీ తాగరాదు, ఆయిల్ ఫుడ్స్, పచ్చళ్లు, చింతపండు, వెల్లుల్లి, అల్లం, వేడి చేసే పండ్లు అనగా బొప్పాయి, జంక్ ఫుడ్స్, చికెన్, ఆమ్లెట్ వంటి వాటికి సాధ్యమైనంత మేర దూరంగా ఉండాలి.

ఎం తినాలి..

వేడి చేసే శరీరతత్వం కలిగిన వారు రెండు పూటలా అధికంగా నీరు తీసుకోవాలి. అలాగే కొబ్బరినీళ్లు, లెమన్ టీ, చద్దన్నం, పలుచటి పెరుగు, తరబుజ, సబ్జా గింజలు వేసిన నీరు, దానిమ్మ పండ్లు, కీరదోస, కమలా పండ్లు, పుచ్చకాయ, క్యారెట్ వంటి చలువ చేసే పదార్ధాలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన వేడిని కంట్రోల్ చేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి.

Tags:    

Similar News