అందుబాటులోకి మరో వ్యాక్సిన్.., మోడెర్నా కు గ్రీన్ సిగ్నల్

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అత్యవసర పరిస్థితుల కింద ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతిచ్చిన యునైటెడ్ స్టేట్స్ ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్.., తాజాగా మోడెర్నా వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అమెరికాలో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోడెర్నా ప్రతినిధులు మాట్లాడుతూ.. డిసెంబర్ చివరికల్లా దేశంలో 2 కోట్ల డోసుల్ని పంపిణీ చేసేందుకు […]

Update: 2020-12-19 00:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అత్యవసర పరిస్థితుల కింద ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతిచ్చిన యునైటెడ్ స్టేట్స్ ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్.., తాజాగా మోడెర్నా వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అమెరికాలో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా మోడెర్నా ప్రతినిధులు మాట్లాడుతూ.. డిసెంబర్ చివరికల్లా దేశంలో 2 కోట్ల డోసుల్ని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది 10 నుంచి పన్నెండున్నర కోట్ల డోసుల్ని పంపిణీ చేస్తామని, అందులో 9 కోట్ల డోసుల్ని స్వదేశంలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తామని మోడెర్నా ప్రతినిధులు తెలిపారు.

కాగా అమెరికాలో ఇప్పటివరకు కోటి 78 లక్షలమంది కరోనా సోకగా.., వారిలో 3 లక్షల 20 వేల మంది మరణించారు. దీంతో పౌరుల్ని కాపాడేందుకు అమెరికా ప్రభుత్వం భద్రత, రక్షణ ప్రమాణాలున్న వ్యాక్సిన్లను వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    

Similar News