ఈ పది పాటిస్తే కరోనా మరణాలు తగ్గించొచ్చు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులతో పోల్చినపుడు మరణాల రేటు తక్కువగానే ఉన్నప్పటికీ ఒక్క ప్రాణమైనా ప్రాణమే కదా… అందుకే వాటిని వీలైనంత మేరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. ముందు ప్రాణాల మీదికి రాకూడదంటే వైరస్ రావొద్దు. అందుకోసం మే 3 తర్వాత ప్రభుత్వాలు పాటించాల్సిన పది విధానాలను డాక్టర్ నర్సింగ రెడ్డి తెలియజేశారు. అవి మీకోసం… 1. పాఠశాలలు, కాలేజీలు లాక్‌డౌన్ కొనసాగించాలి. 2. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ రంగంలో పనులను అనుమతించాలి. మార్కెటింగ్, పంటకోతను […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులతో పోల్చినపుడు మరణాల రేటు తక్కువగానే ఉన్నప్పటికీ ఒక్క ప్రాణమైనా ప్రాణమే కదా… అందుకే వాటిని వీలైనంత మేరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. ముందు ప్రాణాల మీదికి రాకూడదంటే వైరస్ రావొద్దు. అందుకోసం మే 3 తర్వాత ప్రభుత్వాలు పాటించాల్సిన పది విధానాలను డాక్టర్ నర్సింగ రెడ్డి తెలియజేశారు. అవి మీకోసం…
1. పాఠశాలలు, కాలేజీలు లాక్‌డౌన్ కొనసాగించాలి.
2. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ రంగంలో పనులను అనుమతించాలి. మార్కెటింగ్, పంటకోతను అడ్డుకోవద్దు.
3. ఆసుపత్రులను కరోనా, నాన్ కరోనాలుగా విభజించాలి. ఈ విధంగా సాధారణ రోగాలకు కూడా చికిత్స చేసే అవకాశం కలుగుతుంది. అలాగే కరోనా పేషెంట్లకు కూడా ట్రీట్ చేయొచ్చు.
4. వైరస్ బారిన పడటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్న వ్యక్తులను మాత్రమే బయటికి రానివ్వాలి. అది కూడా చాలా ముఖ్యమైన పనులకు మాత్రమే.
5. వ్యాపారాలు, పరిశ్రమలను తక్కువ మొత్తంలో పనిచేసేలా చూడాలి. ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉంటే అందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. కుదరని చోట్లలో సామాజిక దూరం పాటించేందుకు అనుగుణంగా తక్కువ మంది సిబ్బందిని ఉపయోగించుకోవాలి.
6. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనుకున్న వ్యాపారాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. అది కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసేది అయ్యుండాలి.
7. సామాజిక దూరం, ఇతర పరిమితులతో సరుకుల రవాణాను నిర్వహించవచ్చు.
8. ప్రజారవాణాలను ఇప్పట్లో అనుమతించకపోవడమే మంచిది. కానీ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సామాజిక దూరం ప్రోత్సహిస్తూ నెమ్మదిగా దశల వారీగా అనుమతించాలి.
9. ఇక ప్రపంచం, భారతదేశం నుంచి పూర్తిగా కరోనా వైరస్ వెళ్లిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతించాలి.
10. అలాగే పైన చెప్పిన విధానాల వల్ల బయట తిరిగే అనుమతి పొందిన వారి కదలికలను దగ్గరగా పర్యవేక్షించాలి. వారికి తరచుగా పరీక్షలు చేయాలి. ఏ చిన్న అనుమానం వచ్చినా అందర్నీ క్వారంటైన్ చేయాలి.
ఈ పది విధానాలను నెమ్మదిగా పాటించడం అలవాటు చేసి, కొద్దికొద్దిగా సాధారణ జీవితాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఏ సందర్భంలోనైనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోందన్న అనుమానం కలిగితే జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, సంసిద్ధతతో ఉండాలి.
Tags: corona, lockdown, measures, India, doctor narsinga reddy, ideas