బ్యాంకుల విలీనంపై నేడు సమీక్ష!
దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్ 1 నుంచి జరగనున్న బ్యాంకుల విలీనంపై సమీక్షించడానికి గురువారం బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. ఈ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏకీకృతం చేయడానికి ఆమోదం తెలిపింది. అప్పటి మంత్రివర్గం భేటీలో మార్చి 12న బ్యాంకుల విలీనానికి సంబంధించి ప్రణాళిక, సంసిద్ధతను సమీక్షిస్తామని వెల్లడించారు. వినియోగదారులకు అంతరాయం కలిగించకుండా యాంకర్ బ్యాంకులను సంసిద్ధం చేయడం, […]
దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్ 1 నుంచి జరగనున్న బ్యాంకుల విలీనంపై సమీక్షించడానికి గురువారం బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. ఈ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏకీకృతం చేయడానికి ఆమోదం తెలిపింది. అప్పటి మంత్రివర్గం భేటీలో మార్చి 12న బ్యాంకుల విలీనానికి సంబంధించి ప్రణాళిక, సంసిద్ధతను సమీక్షిస్తామని వెల్లడించారు.
వినియోగదారులకు అంతరాయం కలిగించకుండా యాంకర్ బ్యాంకులను సంసిద్ధం చేయడం, ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు ఋణ ప్రవాహానికి హామీ ఇవ్వడం వంటి అంశాలే ఎజెండాగా ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. విలీనం అనంతరం వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను అందించే విషయంపై సమీక్ష నిర్వహించనుంది.
వీటితో పాటు క్రెడిట్లు, డిపాజిట్లను పెంచడం, వ్యాపార వృద్ధి, ఆర్థిక ప్రణాళికల వంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. విలీనానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవనుంది. ఈ విలీనంలో..ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) లను పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)తో విలీనం చేయనున్నారు. ఇది పూర్తయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తర్వాత పీఎన్‌బీ బ్యాంక్ ఇండియాలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకుగా మారనుంది.
అలాగే, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేయనున్నారు. ఇది ఇండియాలోనే నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారుతుంది. వీటితో పాటు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకునూ, కార్పోరేషన్ బ్యాంకునూ విలీనం చేయనున్నారు. ఈ విలీనంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉండనుంది. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ విలీనం చేయడం వల్ల ఇండియన్ బ్యాంక్ ఇండియాలోనే ఏడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పడుతుంది.
ఈ మెగా విలీనాల ద్వారా ఏర్పడే బ్యాంకులు ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నేషనల్ బ్యాంకులతో పోటీపడే సామర్థ్యాన్ని సంపాదిస్తాయి. ఇదివరకూ దేనా బ్యాంకు, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీన చేశారు. దీనికంటే ముందు ప్రభుత్వ అధీనంలోని బ్యాంకులను అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐలో విలీనం చేశారు. విలీనం వల్ల నిర్వహణ లాభం మెరుగుపడుతుందని, రిటైల్ ఋణాలు 11 రోజుల్లో మంజూరు చేయబడతాయని, దీనికి దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడాన్ని ఆర్థిక మంత్రి ఉదాహరణగా ప్రస్తావించారు.
tags: Nirmala Sitharaman, Public Sector Bank, banks merging