లాక్‌డౌన్ పర్యవేక్షణకు స్పెషల్ స్క్వాడ్స్: కలెక్టర్ నారాయణరెడ్డి

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో లాక్‌డౌన్ అమలును పర్యవేక్షించడానికి స్పెసల్ స్క్వాడ్లను నియమించినట్టు కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించేలా ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లావాసులు నడుచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదుగురు, ఆర్మూర్‌లో ముగ్గురు, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల పరిధుల్లో ఇద్దరు చొప్పున […]

Update: 2020-05-06 07:42 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో లాక్‌డౌన్ అమలును పర్యవేక్షించడానికి స్పెసల్ స్క్వాడ్లను నియమించినట్టు కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించేలా ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లావాసులు నడుచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదుగురు, ఆర్మూర్‌లో ముగ్గురు, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల పరిధుల్లో ఇద్దరు చొప్పున స్పెషల్ స్క్వాడ్లను నియమించామని వివరించారు. లాక్‌డౌన్‌ను 24 గంటలు పర్యవేక్షిస్తారని, ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్‌లను ధరించాలని సూచించారు. ఉల్లంఘించిన వారికి రూ. 500 నుంచి రూ. 1000 వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

Tags: Nizamabad, flying squad, lockdown, Monitoring, Collector Narayana Reddy

Tags:    

Similar News