నీటమునిగిన కాళేశ్వరం ఎత్తి పోతల పంప్ హౌస్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ప్యాకెజీ 20లోని ఎత్తి పోతల పథకం సారంగాపూర్ పంప్ హౌస్ నీట మునిగింది. ఇటీవల మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, మంజీరా నదులకు వరద రావడంతో శ్రీరాం సాగర్ నిండి పోయింది. దానితో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా కాళేశ్వరం లింక్ -7 కు సంబంధించిన సారంగాపూర్ వద్ద పంప్ హౌస్‌లోకి నీళ్లు వచ్చి సగం నిండి పోయింది. గత వారం కురిసిన భారీ వర్షాలా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ప్యాకెజీ 20లోని ఎత్తి పోతల పథకం సారంగాపూర్ పంప్ హౌస్ నీట మునిగింది. ఇటీవల మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, మంజీరా నదులకు వరద రావడంతో శ్రీరాం సాగర్ నిండి పోయింది. దానితో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా కాళేశ్వరం లింక్ -7 కు సంబంధించిన సారంగాపూర్ వద్ద పంప్ హౌస్‌లోకి నీళ్లు వచ్చి సగం నిండి పోయింది. గత వారం కురిసిన భారీ వర్షాలా కారణంగా నిజామాబాద్ నీట మునిగిన సారంగపూర్ పంప్ హౌస్‌లోనీ రెండు మోటార్లు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన సారంగా పూర్ పంప్ హౌస్ రెండు నెలల కింద రెండు మోటార్లు బిగింపు, మరో మోటార్ బిగించేందుకు సాగుతున్న పనులు గోదావరి జలాలను సారంగపూర్ నుంచి మూడు దశల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అందించే ప్రణాళిక సర్జిపూల్ పంప్ హౌజ్ వద్ద 2472 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు 91 మీటర్ల సామర్థ్యంతో సారంగాపూర్ పంప్ హౌజ్ నిర్మాణం జరిగింది.
ఎస్సారెస్పీ నుంచి నీళ్ళు సర్జిపూల్‌లో అందుబాటులో ఉండగా డ్రాఫ్ట్ ట్యూబ్‌ల ద్వారా పంపులకు అందుతాయి. పంపులు తిరిగినప్పుడు నీరు మెయిన్ ఫ్రెజర్ ద్వారా భూమిపైకి తేరుకుని సిస్టర్న్ ద్వారా కాలువలోకి పంపుతారు. సర్జ్ పూల్, పంప్ హౌస్ మధ్య ఉన్న గేట్ల ద్వారా లీకేజీ తోనే పంప్ హౌస్‌లో నీళ్లు చేరినట్లు అనుమానం. ఎస్సారెస్పీ వెనుక జలాల పూర్తి నీటి మట్టం కంటే ఒకటిన్నర మీటర్లు పెరగడంతో కాళేశ్వరం లింక్7 హెడ్ రెగ్యులేటర్ గేట్లపై నుంచి పంప్ హౌస్‌కు వరద అర్థరాత్రి నుంచి మరమ్మతులను అధికారులు చేపట్టారు. కాళేశ్వరం 20వ ప్యాకేజీ అంచనా వ్యయం 892.6కోట్లతో 2018 నాటికి పూర్తి కావాల్సిన పనుల నత్తను తలపిస్తున్నాయి.
పంప్ హౌజ్‌తో పాటు టన్నెల్‌లో నీరు నిలిచి ఉండడంతో పంప్ హౌజ్‌లో చేరిన నీటి తొలగింపునకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్సారెస్పీకి వచ్చిన వరదల వల్ల సారంగాపూర్ పంప్ హౌజ్ మునగడం పై అనుమానాలున్నాయి. కాళేశ్వరం లింక్ 7 హెడ్ రెగ్యులరేటర్ ద్వారా ఎఫ్ ఆర్ ఎల్‌తో రెండు గేట్లు ఏర్పాటు చేయగా అక్కడి నుంచి నీళ్ళు రావడంపై అధికారులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ప్రాజెక్టు పూర్తిగా నిండితే అలల ప్రభావంతో టాప్ బాండ్ లెవల్ అంచనా వేసి రెగ్యులరేటర్ ను నిర్మించారు. ఎత్తిపోతల పథకాల డిజైన్‌లో లోపం వల్లనే ఇది జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నీటిమట్టం తగ్గాక సారంగాపూర్ పంప్ హౌజ్‌లోని నీటిని తోడేసి పనులు చేపడుతామని నిజామాబాద్ సర్కిల్ సీఈ మధుసుదన్ రావు తెలిపారు.