నగరంలో వర్షం.. భయం గుప్పిట్లో జనం !
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం మొదలైన వర్షం విరామం లేకుండా పడుతుండటంతో ప్రజలు భయానికి గురవుతున్నారు. ఇదే వర్షం ఇంకో రెండు మూడు గంటలు కొనసాగితే మళ్లీ భారీగా వరద నీరు వచ్చి ఇళ్లలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టింది. రాత్రిపూట కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలన్న భయపడి ఇళ్లలోనే ఉంటున్నారు. సాయంత్రం ఓల్డ్ మలక్‌పేటలో ఓ వ్యక్తి పుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తూ […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం మొదలైన వర్షం విరామం లేకుండా పడుతుండటంతో ప్రజలు భయానికి గురవుతున్నారు. ఇదే వర్షం ఇంకో రెండు మూడు గంటలు కొనసాగితే మళ్లీ భారీగా వరద నీరు వచ్చి ఇళ్లలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టింది. రాత్రిపూట కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలన్న భయపడి ఇళ్లలోనే ఉంటున్నారు.
సాయంత్రం ఓల్డ్ మలక్‌పేటలో ఓ వ్యక్తి పుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తూ కరెంట్ స్తంభాన్ని పట్టుకోవడంతో షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములు(40)గా గుర్తించారు. బతుకుదెరువు కోసం కోసం నగరానికి వచ్చి జీవనం సాగిస్తుండగా కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే సమయంలో కరెంట్ స్తంభాలను పట్టుకోవద్దని, మ్యాన్ హోళ్లు ఉన్న దగ్గర జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు.