నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

దిశ, వెబ్‎డెస్క్: గత మూడు రోజుల నుంచి ఎగువన భారీవర్షాలు కురుస్తుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో సాగర్ ప్రాజెక్టు 16 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,76,778 క్యూసెక్కులు ఉండగా.. అదే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 310.55 టీఎంసీలు ఉన్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టం […]

Update: 2020-10-13 04:39 GMT

దిశ, వెబ్‎డెస్క్:
గత మూడు రోజుల నుంచి ఎగువన భారీవర్షాలు కురుస్తుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో సాగర్ ప్రాజెక్టు 16 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,76,778 క్యూసెక్కులు ఉండగా.. అదే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 310.55 టీఎంసీలు ఉన్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నిల్వ 589.5 అడుగులు చేరింది.

Tags:    

Similar News