జూరాలకు కొనసాగుతున్న వరద
దిశ, మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 37 గేట్ల ద్వారా 3,44,567 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా 3,46,000 క్యూసెక్కుల వరద నీరు కొత్తగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం 7.701 టీఎంసీల నిటిని నిల్వ ఉంచారు. ప్రస్తుతం ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, దిగువ జూరాల జల […]
దిశ, మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 37 గేట్ల ద్వారా 3,44,567 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా 3,46,000 క్యూసెక్కుల వరద నీరు కొత్తగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం 7.701 టీఎంసీల నిటిని నిల్వ ఉంచారు. ప్రస్తుతం ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్‌లో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.