కాసేపట్లో ముహూర్తం.. ఇంతలో ఫోన్.. ఆగిన పెళ్లి

దిశ, ఏపీ బ్యూరో : సహజంగా పెళ్లిలు ఆగిపోయాయంటే ప్రధాన కారణం.. అమ్మాయికి అబ్బాయి ఇష్టం లేకనో.. కట్నకానుకల్లో లోటు వచ్చిందనో ఆగిపోతుంటాయి. కానీ చిత్తూరు జిల్లాలో వర్షం ఓ పెళ్లిని ఆపేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. నమ్మక తప్పదు. ఇంతకూ ఏం జరిగిందంటే.. చిత్తూరు జిల్లాలో నివర్​ తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్నది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్యాంలకు వరద పోటెత్తింది. జిల్లాలోని పెద్ద మండ్యం మండలం పాపేపల్లి వద్ద వాగు కూడా వరద […]

Update: 2020-11-28 08:42 GMT

దిశ, ఏపీ బ్యూరో : సహజంగా పెళ్లిలు ఆగిపోయాయంటే ప్రధాన కారణం.. అమ్మాయికి అబ్బాయి ఇష్టం లేకనో.. కట్నకానుకల్లో లోటు వచ్చిందనో ఆగిపోతుంటాయి. కానీ చిత్తూరు జిల్లాలో వర్షం ఓ పెళ్లిని ఆపేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. నమ్మక తప్పదు. ఇంతకూ ఏం జరిగిందంటే..

చిత్తూరు జిల్లాలో నివర్​ తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్నది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్యాంలకు వరద పోటెత్తింది. జిల్లాలోని పెద్ద మండ్యం మండలం పాపేపల్లి వద్ద వాగు కూడా వరద ఉధృతికి ఉగ్రరూపం దాల్చింది. అయితే పాపేపల్లి గ్రామానికి చెందిన మమతతో బీ.కొత్తకోట మండలం దేవరాజుపల్లికి చెందిన సుధాకర్‌కు పెళ్లి నిశ్చయం అయింది. శుక్రవారం వీరి వివాహం గట్టు వద్ద జరగాల్సింది ఉంది. కానీ పాపేపల్లికి గట్టుకు మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో పెళ్లి కూతురు దానిని దాటలేక పోయింది. దీంతో పెళ్లి వాయిదా పడింది.

Tags:    

Similar News