రానున్న రోజుల్లో ఫ్లెక్స్ ఇంజిన్‌లను తప్పనిసరి చేయనున్న ప్రభుత్వం!

దిశ, వెబ్‌డెస్క్: వాహనాల్లో ఇథనాల్‌ ఆధారిత ఫ్లెక్స్‌ ఇంజిన్‌ల వాడకం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, ఇతర ఇంధనాలకు కాలుష్య రహిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాబోయే రోజుల్లో ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజిన్‌లను తప్పనిసరి చేయనున్నట్టు గురువారం ఓ కార్యక్రమంలో చెప్పారు. గ్యాసోలిన్, మిథనాల్ లేదా ఇథనాల్‌తో కూడిన ఫ్లెక్స్-ఇంధనం ప్రత్యామ్నాయం కావాలన్నారు. దీనివల్ల దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల స్థానంలో ఇథనాల్ పంపులను భర్తీ చేయవచ్చని తెలిపారు. ఇప్పటికే పూణెలో మూడు ఇథనాల్ […]

Update: 2021-11-11 07:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాహనాల్లో ఇథనాల్‌ ఆధారిత ఫ్లెక్స్‌ ఇంజిన్‌ల వాడకం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, ఇతర ఇంధనాలకు కాలుష్య రహిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాబోయే రోజుల్లో ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజిన్‌లను తప్పనిసరి చేయనున్నట్టు గురువారం ఓ కార్యక్రమంలో చెప్పారు. గ్యాసోలిన్, మిథనాల్ లేదా ఇథనాల్‌తో కూడిన ఫ్లెక్స్-ఇంధనం ప్రత్యామ్నాయం కావాలన్నారు. దీనివల్ల దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల స్థానంలో ఇథనాల్ పంపులను భర్తీ చేయవచ్చని తెలిపారు.

ఇప్పటికే పూణెలో మూడు ఇథనాల్ పంపులు ఉన్నాయని, ఇటీవల టయోటా సంస్థ ఫ్లెక్సిబుల్ ఇంజిన్ కలిగిన కార్లను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఇంజిన్ అంటే 100 శాతం పెట్రోల్ లేదా ఇథనాల్ వాడకమని, ఇది యూరో 6 నిబంధనలపై(యూరోపియన్ ఉద్గార ప్రమాణాలు గ్యాసోలిన్, డీజిల్ వాహనాలను విడివిడిగా నియంత్రిస్తాయి) రూపొందించబడ్డాయని, త్వరలో ఫ్లెక్స్ ఇంజిన్‌లను తప్పనిసరి చేయనున్నట్టు గడ్కరీ వివరించారు. పెరుగుతున్న ఇంధన ధరల గురించి ఆందోళన వద్దని, ఇథనాల్ రూ. 62 ఉందని గడ్కరీ పేర్కొన్నారు.

Tags:    

Similar News