ఏపీలో కూరగాయల రేట్లు ఫిక్స్
లాక్ డౌన్ ను ఆసరాగా తీసుకుని వ్యాపారులు కూరగాయలు, నిత్యవసర ధరలు ఎలా పడితే అలా పెంచకుండా ప్రభుత్వమే ధరలు ఫిక్స్ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. అధిక ధరలకు అమ్మిన వ్యాపారులపై పీడీయాక్టు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కూరగాయల ధరలు ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. వంకాయ-30, […]
లాక్ డౌన్ ను ఆసరాగా తీసుకుని వ్యాపారులు కూరగాయలు, నిత్యవసర ధరలు ఎలా పడితే అలా పెంచకుండా ప్రభుత్వమే ధరలు ఫిక్స్ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. అధిక ధరలకు అమ్మిన వ్యాపారులపై పీడీయాక్టు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కూరగాయల ధరలు ఉండాలని సూచించారు.
ప్రభుత్వం నిర్ణయించిన కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
వంకాయ-30, బెండకాయ-40, టమాటా-10, అరటికాయ-40, కాలీఫ్లవర్-40, క్యాబేజీ-23, పచ్చిమర్చి-60, చిక్కుడుకాయ-45, బీరకాయ-60, క్యారెట్-60, బంగాళదుంప-30, ఉల్లిపాయ-30, వెల్లుల్లి-160, అల్లం220, పాలకూర-40, తోటకూర-40,కొత్తిమీర-60, మెంతికూర-60, కందిపప్పు గ్రేడ్1-95, మినపప్పు-140, పెసరపప్పు-105, శనగపప్పు-65,గోదుమలు-36 ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏపీ సీఎం హెచ్చరించారు.
Tags; Fix vegetable rates in AP,Prices set by the government,At a higher price,Legal proceedings