అమరావతి పరిధి నుంచి గ్రామాల తొలగింపు
ఏపీ రాజధాని అమరావతి విషయానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నగర పరిధి నుంచి ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లి, మంగళగిరి పురపాలక సంఘాల్లో వీటిని విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆ ఐదు గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. కుట్రపూరితంగానే తమ గ్రామాలను రాజధాని నగర పరిధి నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. రాజధాని […]
ఏపీ రాజధాని అమరావతి విషయానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నగర పరిధి నుంచి ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లి, మంగళగిరి పురపాలక సంఘాల్లో వీటిని విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆ ఐదు గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. కుట్రపూరితంగానే తమ గ్రామాలను రాజధాని నగర పరిధి నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనీ, ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని రైతులు తెలిపారు.