మెసేజింగ్ యాప్స్‌కు పోటీనిస్తున్న ‘సిగ్నల్’ ప్రైవసీ ఫీచర్స్
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం జనాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్‌లో ‘సిగ్నల్’ ఒకటి. వాట్సాప్, టెలిగ్రామ్ మాదిరి మోస్ట్ ఫీచర్ ప్యాక్డ్ యాప్ కానప్పటికీ, ప్రైవసీ విషయంలో ఆ రెండింటికీ మించిన ఫీచర్స్ ఇందులో ఉండటం విశేషం. చాలా వరకు యాప్స్ ‘యూజర్ డేటా ప్రొటెక్షన్’ మెయింటైన్ చేయవు. కానీ ‘సిగ్నల్’ మాత్రం ఇదే మోటోతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. చాట్, ఫోన్ కాల్స్ విషయంలోనూ సిగ్నల్ యాప్ తమ యూజర్లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందిస్తోంది. ఇవేకాదు, ఇంతకుమించిన […]
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం జనాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్‌లో ‘సిగ్నల్’ ఒకటి. వాట్సాప్, టెలిగ్రామ్ మాదిరి మోస్ట్ ఫీచర్ ప్యాక్డ్ యాప్ కానప్పటికీ, ప్రైవసీ విషయంలో ఆ రెండింటికీ మించిన ఫీచర్స్ ఇందులో ఉండటం విశేషం. చాలా వరకు యాప్స్ ‘యూజర్ డేటా ప్రొటెక్షన్’ మెయింటైన్ చేయవు. కానీ ‘సిగ్నల్’ మాత్రం ఇదే మోటోతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. చాట్, ఫోన్ కాల్స్ విషయంలోనూ సిగ్నల్ యాప్ తమ యూజర్లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందిస్తోంది. ఇవేకాదు, ఇంతకుమించిన ప్రైవసీ ఓరియెంటెడ్ ఫీచర్స్ సిగ్నల్‌లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
బ్లాక్ స్క్రీన్ షాట్స్
‘సిగ్నల్’ తమ యూజర్లకు స్క్రీన్‌షాట్స్ బ్లాక్ చేసే అవకాశం అందిస్తోంది. అయితే ఈ ఫీచర్ కేవలం మన ఫోన్‌కే పరిమితం. మనం చేసిన చాట్‌ను ఇతరులు స్క్రీన్‌షాట్ తీసుకోకుండా నిరోధించదు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే, యాప్ బ్లాక్ ప్రివ్యూను చూపిస్తుంది.
ప్రాక్సీ సపోర్ట్ ఇన్ బ్యాన్డ్ రీజియన్స్
ప్రాక్సీ చిరునామాలకు మద్దతిచ్చే మెసేజింగ్ యాప్స్‌లో ‘సిగ్నల్’ ఒకటి. యాప్ నిషేధించిన దేశాల్లో ప్రాక్సీ సర్వర్ ద్వారా ‘సిగ్నల్’ ఉపయోగించడానికి ఇది అనుమతిస్తుంది. ఈ లక్షణం ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు లింక్‌ను నొక్కినప్పుడు లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు సిగ్నల్ ఆటోమేటిక్‌గా ప్రాక్సీ సర్వర్‌ను కాన్ఫిగర్ చేస్తుంది. ప్రాక్సీని ఉపయోగిస్తున్నప్పుడు కూడా ‘సిగ్నల్’ ట్రాఫిక్ ప్రాక్సీ ఆపరేటర్‌కు అపారదర్శకంగా ఉంటుంది.
ఇన్‌కాగ్నిటో కీబోర్డ్
‘ఇన్‌కాగ్నిటో టాబ్’ గురించి అందరికీ తెలుసు. దీనివల్ల సెర్చ్ హిస్టరీ రికార్డ్ కాదు, అంతేకాదు ఐపీ చిరునామాను గుర్తించలేం. అంతేకాదు యూజర్‌ను అనానమస్‌గా చూపిస్తుంది. సేమ్ ఇలానే ఇన్‌కాగ్నిటో కీబోర్డ్ పని చేస్తుంది. కీబోర్డ్ టైపింగ్ హిస్టరీని స్వీకరించదు. దీని ఫలితంగా డిక్షనరీ, ఆటో కరెక్షన్ వర్క్ చేయవు. సిగ్నల్ ఇన్‌కాగ్నిటో కీబోర్డ్ ప్రత్యేక కీబోర్డ్ కాదు, కానీ ప్రస్తుత కీబోర్డ్ యాప్‌కు మోడిఫైడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే.. టైపింగ్ హిస్టరీ నుంచి కంప్లీట్ ప్రైవసీ పొందొచ్చు.
రిలే కాల్స్
రిలే కాల్స్.. ఫీచర్ ఫోన్ కాల్స్‌ను ‘సిగ్నల్’ సర్వర్ ద్వారా ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. సాధారణ కాల్స్‌తో పోలిస్తే, రీసివర్స్ మన ఐపీ చిరునామాను పొందకుండా నిరోధించడమే దీనివల్ల కలిగే ప్రయోజనం.
ఎస్‌ఎమ్ఎస్ ఇంటిగ్రేషన్
చాటింగ్ కోసం సాధారణంగా వాట్సాప్, ఎఫ్‌బీ మెసెంజర్ ఇంకా ఇతర చాటింగ్ యాప్స్ వాడుతుంటాం. ఎస్‌ఎమ్‌ఎస్ సర్వీస్ కూడా ఉపయోగించుకుంటాం. ఈ ఫీచర్ వల్ల చాట్స్‌తో పాటు ఎస్‌ఎమ్‌ఎస్ కూడా ఒకే చోట చేసుకునే సదుపాయం ఉంటుంది.