మహాలయ అమావాస్య రోజు 'మహా' విషాదం..

దిశప్రతినిధి, మహబూబ్ నగర్: నాగర్ కర్నూలు జిల్లాలో మహాలయ అమావాస్య  రోజైనా బుధవారం ఉదయం వేరువేరుగా జరిగిన సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. వంగూరు మండలం చౌదర్ పల్లి వద్ద వేగంగా వెళుతున్న మోటార్ సైకిల్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడిపోవడంతో రంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు(25), నరేష్ (20) మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న తమిళనాడుకు చెందిన జక్కా అర్జున్(32)  నిర్మాణంలో ఉన్న నూతన భవనం […]

Update: 2021-10-06 00:10 GMT

దిశప్రతినిధి, మహబూబ్ నగర్: నాగర్ కర్నూలు జిల్లాలో మహాలయ అమావాస్య రోజైనా బుధవారం ఉదయం వేరువేరుగా జరిగిన సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. వంగూరు మండలం చౌదర్ పల్లి వద్ద వేగంగా వెళుతున్న మోటార్ సైకిల్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడిపోవడంతో రంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు(25), నరేష్ (20) మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న తమిళనాడుకు చెందిన జక్కా అర్జున్(32) నిర్మాణంలో ఉన్న నూతన భవనం ముందు విగతజీవిగా ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.

వ్యక్తిగత కారణాలతో అర్జున్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా హత్య చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పెంట్లవెల్లి మండలం జెట్ ప్రోలు గ్రామంలో కుటుంబ కలహాలతో గువ్వల అంజి అనే యువకుడు ఆర్టీసీ బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామం సమీపంలో మోటార్ సైకిల్ ఢీ కొన్న సంఘటనలో మరో వ్యక్తి మరణించాడు. మహాలయ అమావాస్య రోజు వేరు వేరు సంఘటనలో ఐదుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాలలో విషాదం నెలకొంది.

Tags:    

Similar News