అనుమతి లేకున్నా ట్రీట్మెంట్.. ఐదుగురు కొవిడ్ రోగులు మృతి.. వైద్యులు జంప్!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజువారీగా పదివేలకు పైగానే కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వలన కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనాకు వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సమాచారం. తీరా ఘోరం జరిగాక యాజమాన్యం, వైద్యులు, […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజువారీగా పదివేలకు పైగానే కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వలన కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనాకు వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సమాచారం. తీరా ఘోరం జరిగాక యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ఆస్పత్రిని వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై జిల్లా డీఎంహెచ్‌వో స్పందించారు. కేఎస్ కేర్ ఆస్పత్రికి కొవిడ్ చికిత్స అనుమతి లేదన్నారు. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందినట్లు సమాచారం అందినదని పేర్కొన్నారు.మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులో లేదని తెలిపారు.