క్షుద్ర పూజల ప్రయత్నాలు.. నిందితుల అరెస్ట్
దిశ ప్రతినిధి, కరీంనగర్: క్షుద్రపూజలు చేస్తే రూ.కోట్లు వర్షంగా కురుస్తాయని ముఠా ఒక మహిళను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె కూతురిని తమకు అప్పగిస్తే డబ్బులతో పాటు బంగారం ఇస్తామని ఆశ చూపింది. ఆ తల్లి పోలీసుల ఆశ్రయించడంతో ముఠా గుట్టు రట్టయింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. పెద్దపల్లికి చెందిన ఓ మహిళను కలిసిన గ్యాంగ్.. ఆమె కూతురును తమకు అప్పగించాలని కోరింది. అందుకు ఆమెకు రూ.20 […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: క్షుద్రపూజలు చేస్తే రూ.కోట్లు వర్షంగా కురుస్తాయని ముఠా ఒక మహిళను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె కూతురిని తమకు అప్పగిస్తే డబ్బులతో పాటు బంగారం ఇస్తామని ఆశ చూపింది. ఆ తల్లి పోలీసుల ఆశ్రయించడంతో ముఠా గుట్టు రట్టయింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.
పెద్దపల్లికి చెందిన ఓ మహిళను కలిసిన గ్యాంగ్.. ఆమె కూతురును తమకు అప్పగించాలని కోరింది. అందుకు ఆమెకు రూ.20 లక్షలు, బంగారం ఇస్తామని ఆశ చూపింది. వారిపై అనుమానం రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన రాజేందర్, కుమార్ ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారితో పాటు వారికి సహకరించిన ఒక పూజారి, మల్లమ్మ, సరితను అరెస్టు చేశారు. కాగా, ఆ గ్యాంగ్ తన కూతురుని ఎందుకు లక్ష్యంగా ఎంచుకుందో అర్థం కావడం లేదని సదురు యువతి తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది.