కొవిడ్ రాదనుకున్నాడు.. దానికే బలయ్యాడు!
దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌కు చెందిన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ దిమిత్రీ స్టుజుక్ అసలు భూమ్మీద కరోనా వైరస్ అనేది ఉందనంటే నమ్మేవాడు కాదు. అలాంటి ఒక వైరస్ లేదని తన ఫాలోవర్లతో వితండవాదం కూడా చేసేవాడు. కానీ అక్టోబర్ 16వ తేదీన ఆయన మాజీ భార్య సోఫియా, 33 ఏళ్ల స్టుజుక్ కొవిడ్ కారణంగా మరణించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. అక్టోబర్ 15న తన 1.1 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు స్టుజుక్ స్వయంగా తనకు కరోనా వైరస్ సోకినట్లు తెలిపాడు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌కు చెందిన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ దిమిత్రీ స్టుజుక్ అసలు భూమ్మీద కరోనా వైరస్ అనేది ఉందనంటే నమ్మేవాడు కాదు. అలాంటి ఒక వైరస్ లేదని తన ఫాలోవర్లతో వితండవాదం కూడా చేసేవాడు. కానీ అక్టోబర్ 16వ తేదీన ఆయన మాజీ భార్య సోఫియా, 33 ఏళ్ల స్టుజుక్ కొవిడ్ కారణంగా మరణించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. అక్టోబర్ 15న తన 1.1 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు స్టుజుక్ స్వయంగా తనకు కరోనా వైరస్ సోకినట్లు తెలిపాడు. అంతేకాకుండా కొవిడ్ 19 అనేది సాధారణ జబ్బు కాదని, జాగ్రత్తగా ఉండాలని, ఇంతకాలం తాను నమ్మలేదని, తనకు వచ్చే వరకు గానీ ఆ వైరస్ తీవ్రత అర్థం చేసుకోలేకపోయానని చెప్పాడు.
అదే రోజు రాత్రి స్టుజుక్ కండిషన్ చాలా విషమంగా మారింది. హృదయకండరాల మీద వైరస్ ప్రభావం చూపించడంతో పరిస్థితి చేజారిపోయిందని డాక్టర్లు చెప్పినట్లు సోఫియా పేర్కొంది. ఆ పరిస్థితుల్లో ఆయనను రక్షించడానికి ఎవరూ ఏమీ చేయలేకపోయారని, వైరస్ దాడికి తన భర్త ప్రాణాలు విడిచాడని సోఫియా బాధపడింది. ఇటీవల టర్కీ వెళ్లి వచ్చాక ఆయనకు శ్వాసలో సమస్యలు, కడుపు నొప్పి ప్రారంభమయ్యాయని, ఆస్పత్రిలో టెస్ట్ చేయిస్తే కొవిడ్ సోకినట్లు తెలిసిందని ఆమె వెల్లడించారు. ఎనిమిది రోజులు ఆస్పత్రిలో ఉండి, అక్టోబర్ 15న హోమ్ ఐసోలేషన్‌కు మార్చారు. దాదాపుగా తగ్గిందనుకునే సమయంలో అక్టోబర్ 15 రాత్రి పూట పరిస్థితి విషమించి స్టుజుక్ చనిపోవడం నిజంగా బాధాకరం. కరోనా పెద్ద వయస్సు వారికి, వ్యాయామం చేయని వారికి మాత్రమే సీరియస్‌గా ఉంటుంది, మిగతా వాళ్లు ఎప్పటిలాగే ఉండొచ్చు అనుకునే వాళ్లందరికీ ఈ 33 ఏళ్ల జిమ్ ఫ్రీక్ మరణమే ఉదాహరణ.