విషప్రయోగంతో భారీగా చేపలు మృతి

దిశ, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట పాండ్య చెరువులో విషప్రయోగంతో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.30 లక్షలు విలువ చేసే చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ ఆంజనేయులు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్టి రాజు మాట్లాడుతూ.. ఈ ఘటనలో దోషులు కఠినంగా శిక్షించాలని.. నిరుపేదలైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. […]

Update: 2020-10-08 10:55 GMT

దిశ, మెదక్:
మెదక్ జిల్లా రామాయంపేట పాండ్య చెరువులో విషప్రయోగంతో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.30 లక్షలు విలువ చేసే చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ ఆంజనేయులు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా పుట్టి రాజు మాట్లాడుతూ.. ఈ ఘటనలో దోషులు కఠినంగా శిక్షించాలని.. నిరుపేదలైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అంజనేయులు తెలిపారు.

Tags:    

Similar News