US నుంచి ఇండియాకు చేరిన ఆక్సిజన్ సిలిండర్లు

న్యూఢిల్లీ: కరోనాపై భారత్ పోరులో అమెరికా సహకరిస్తుందని బుధవారం హామీనిచ్చింది. కనీసం 10 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్‌కు అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా అమెరికా నుంచి వైద్య సామగ్రితో తొలి ఫ్లైట్ దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. 400కుపైగా ఆక్సిజన్ సిలిండర్లు, సుమారు పది లక్షల ర్యాపిడ్ కరోనా టెస్టు కిట్లు, హెల్త్ వర్కర్ల కోసం ఒక లక్ష ఎన్‌95 మాస్కులను యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-5ఎం సూపర్ గెలాక్సీ విమానం ఈ […]

Update: 2021-04-29 22:43 GMT

న్యూఢిల్లీ: కరోనాపై భారత్ పోరులో అమెరికా సహకరిస్తుందని బుధవారం హామీనిచ్చింది. కనీసం 10 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్‌కు అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా అమెరికా నుంచి వైద్య సామగ్రితో తొలి ఫ్లైట్ దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. 400కుపైగా ఆక్సిజన్ సిలిండర్లు, సుమారు పది లక్షల ర్యాపిడ్ కరోనా టెస్టు కిట్లు, హెల్త్ వర్కర్ల కోసం ఒక లక్ష ఎన్‌95 మాస్కులను యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-5ఎం సూపర్ గెలాక్సీ విమానం ఈ రోజు ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. అమెరికా నుంచి తొలి సహకార షిప్‌మెంట్ భారత్‌కు చేరుకుందని యూఎస్ ఎంబస్సీ ట్వీట్ చేసింది. ఇరుదేశాలు 70ఏళ్ల సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాయని వివరించింది. కరోనాపై పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందని తెలిపింది.

Tags:    

Similar News