కరోనాను మొదట కనిపెట్టిన శాస్త్రవేత్త ఈమే!

దిశ, వెబ్‌డెస్క్: సంవత్సరాలపాటు కష్టపడి ఒక శాస్త్రవేత్త ప్రమాదం వస్తుందని చెప్పడం, అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం, తర్వాత ప్రపంచ మొత్తం ఇబ్బంది పడటం… ఇలాంటి కథనంతో చాలా ఇంగ్లిషు సినిమాలు వచ్చాయి. జూన్ ఆల్మీడా అనే మహిళా శాస్త్రవేత్తది కూడా అలాంటిది కథే! 1964లో తన పరిశోధనలతో కరోనా వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్త ఈమె. ఆమెకు 34 ఏళ్ల వయసు ఉన్నపుడు తాను చేస్తున్న పరిశోధనల్లో ఒక కొత్త వైరస్ జాడ కనిపెట్టినట్లు జూన్ పేర్కొన్నారు. అయితే […]

Update: 2020-04-20 01:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంవత్సరాలపాటు కష్టపడి ఒక శాస్త్రవేత్త ప్రమాదం వస్తుందని చెప్పడం, అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం, తర్వాత ప్రపంచ మొత్తం ఇబ్బంది పడటం… ఇలాంటి కథనంతో చాలా ఇంగ్లిషు సినిమాలు వచ్చాయి. జూన్ ఆల్మీడా అనే మహిళా శాస్త్రవేత్తది కూడా అలాంటిది కథే! 1964లో తన పరిశోధనలతో కరోనా వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్త ఈమె.

ఆమెకు 34 ఏళ్ల వయసు ఉన్నపుడు తాను చేస్తున్న పరిశోధనల్లో ఒక కొత్త వైరస్ జాడ కనిపెట్టినట్లు జూన్ పేర్కొన్నారు. అయితే ఆమె వ్యాసాన్ని, ఆవిష్కరణను సైన్స్ ప్రపంచం కొట్టిపారేసింది. గుండ్రని ఆకారం మీద కిరీటాల్లాంటి కోరలతో ఉన్న వైరస్ బొమ్మలను కూడా చూపించింది. కానీ పాత జలుబు వైరస్ బొమ్మలకే కోరలు తగిలించి చూపించిందంటూ రిఫరీలు ఆమె పరిశోధనను తిరస్కరించారు. కానీ 50 ఏళ్ల తర్వాత అదే వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేస్తుందని వాళ్లు అప్పుడు గ్రహించలేకపోయారు.

కొవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో ఇప్పుడు జూన్‌ని అందరూ తలుచుకుంటున్నారు. మొదటి హ్యూమన్ కరోనావైరస్ కనిపెట్ట వైరాలజిస్టుగా గుర్తిస్తున్నారు. 1930 అక్టోబర్ 5న గ్లాస్గోలో జూన్ జన్మించారు. ఆర్థిక సమస్యల కారణంగా పెద్దగా చదువుకోలేదు. 17 ఏళ్ల వయసులో గ్లాస్గో రాయల్ ఇన్ఫర్మరీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత పెళ్లయ్యాక టొరంటోలోని ఓంటారియో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నీషియన్‌గా ఉద్యోగం సంపాదించారు. ఆరోజుల్లో కెనడాలో యూనివర్సిటీ డిగ్రీ లేకుండా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందడం చాలా సులభం. దీంతో టెక్నీషియన్‌గా తన అనుభవాన్ని రంగరించి వైరాలజీ శాస్త్రవేత్తగా ఎన్నో వ్యాసాలను జూన్ ప్రచురించారు. వాటిలో ఎక్కువగా కంటికి కనిపించని వైరస్‌ల గురించే ఉండేవి. తర్వాత 1964లో లండన్‌లో సెయింట్ థామస్ హాస్పిటల్ మెడికల్ స్కూల్‌లో పరిశోధనలు చేసే అవకాశం దొరికింది. అక్కడ ఆర్గాన్ కల్చర్ విధానాన్ని కనిపెట్టిన డీఏజే టైరెల్‌తో కలిసి జలుబు వైరస్‌ల మీద పరిశోధించారు. ఆ క్రమంలో వీరికి కరోనా వైరస్ గురించి తెలిసినట్లు మెడికల్ రైటర్ జార్జ్ వింటర్ వివరించారు. వీళ్లిద్దరూ టోనీ వాటర్సన్‌తో కలిసి కిరీటాలు కలిగిన ఈ వైరస్‌కు కరోనా వైరస్ అని పేరు పెట్టినట్లు కూడా జార్జ్ తెలిపారు. మొదట్లో వీరి వ్యాసం తిరస్కరణకు గురైన తర్వాత రెండేళ్లకు జనరల్ వైరాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. తర్వాత కూడా ఆమె అనేక పరిశోధనలు చేసి 77 ఏళ్ల వయసులో 2007లో ఆమె హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు.

Tags: corona, covid, first scientist, June Almeida, thesis, london, UK, Science

Tags:    

Similar News