ముందు నెగెటివ్.. తరువాత పాజిటివ్
దిశ, ఆదిలాబాద్: క్వారంటైన్ ముందు చేసిన పరీక్షల్లో నెగెటివ్ రాగా.. తాజాగా చేసిన కోవిడ్ పరీక్షలో ఓ వ్యక్తి పాజిటివ్ అని తేలింది. ఈ ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. మర్కజ్ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని క్వారంటైన్ చేసి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్‌లో నెగిటివ్ వచ్చింది. 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తరువాత ఆ వ్యక్తికి మరోసారి పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారుల్లో తీవ్ర కలవరం మొదలైంది. బాధితుడిని హైదరాబాద్‌లోని గాంధీ […]
దిశ, ఆదిలాబాద్: క్వారంటైన్ ముందు చేసిన పరీక్షల్లో నెగెటివ్ రాగా.. తాజాగా చేసిన కోవిడ్ పరీక్షలో ఓ వ్యక్తి పాజిటివ్ అని తేలింది. ఈ ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. మర్కజ్ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని క్వారంటైన్ చేసి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్‌లో నెగిటివ్ వచ్చింది. 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తరువాత ఆ వ్యక్తికి మరోసారి పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారుల్లో తీవ్ర కలవరం మొదలైంది. బాధితుడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితుడు ఉంటున్న మోతీనగర్ ఏరియాను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి మళ్లీ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Tags: carona, negitive, positive, nirmal, ts news