భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతోంది. గురువారం తెల్లవారుజామున 3.35 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోగానే జిల్లా కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద గంటగంటకు పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు 44.60 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకి 9,43,478 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పెరుగుతున్న వరద 48 […]

Update: 2021-09-08 22:18 GMT

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతోంది. గురువారం తెల్లవారుజామున 3.35 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోగానే జిల్లా కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద గంటగంటకు పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు 44.60 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకి 9,43,478 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పెరుగుతున్న వరద 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి వరద దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ అలెర్ట్ చేశారు. సెలవులు రద్దుచేస్తూ కార్యస్థానంలో అందుబాటుగా ఉండాలని ఇప్పటికే ప్లడ్ డ్యూటీ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు చేశారు. పెరుగుతున్న గోదావరి లంకలపై పైర్లకు ఏ మేరకు నష్టం చేస్తుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

 

Tags:    

Similar News