ఫస్డ్ డోసు బంద్.. అందరికీ సెకండ్ డోసే!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డోసు పంపిణీ సమర్ధవంతంగా జరగడం లేదు. 90 శాతం ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో తొలి డోసును ఇవ్వడం లేదు. కేవలం సెకండ్డోసును మాత్రమే ఇస్తున్నారు. సుమారు 36 లక్షలకు పైగా రెండో డోసు లబ్ధిదారులు పెండింగ్ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పడం గమనార్హం. దీంతో టీకాలు కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. అనేక మంది కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా, డోసుల పంపిణీ జరగడం లేదు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డోసు పంపిణీ సమర్ధవంతంగా జరగడం లేదు. 90 శాతం ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో తొలి డోసును ఇవ్వడం లేదు. కేవలం సెకండ్డోసును మాత్రమే ఇస్తున్నారు. సుమారు 36 లక్షలకు పైగా రెండో డోసు లబ్ధిదారులు పెండింగ్ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పడం గమనార్హం. దీంతో టీకాలు కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. అనేక మంది కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా, డోసుల పంపిణీ జరగడం లేదు. దీంతో చేసేదేమీ లేక చాలా మంది వెనుతిరిగి వెళ్లిపోతున్నారు.
మరి కొన్ని సెంటర్లలో ఇప్పటికీ టోకెన్ల విధానం నడుస్తున్నది. కేంద్రాలకు వచ్చినోళ్లలో కొందరికి టోకెన్లు ఇచ్చి మరుసటి రోజుకు రావాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో పదే పదే కేంద్రాలు చుట్టూ తిరిగేందుకు ఇష్టం లేక అనేక మంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. ఎక్కడికక్కడ టీకాలు అందిస్తున్నామని ఆరోగ్యశాఖ చెబుతున్నా, అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మొబైల్ కేంద్రాల ముచ్చటనే మరిచారు. కేంద్రాలకు వచ్చినోళ్లందరికీ టీకాలు ఇవ్వాలని ఇటీవల హెల్త్ డైరెక్టర్ సూచించినా, క్రింది స్థాయి అధికారుల్లో మార్పు రాలేదు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం కలుగుతున్నది.
100 శాతం ఎలా సాధ్యం…?
18 ఏళ్ల పై బడిన వారిలో దాదాపు 69 లక్షల మంది ఇప్పటి వరకు అసలు టీకా తీసుకోలేదు. వీరందరికీ వేగంగా పంపిణీ చేస్తామని డైరెక్టర్ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. కొత్త వేరియంట్లు రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్వేసుకోవాలని సూచించారు. దీంతో ఇప్పటి వరకు పొందనోళ్లు కేంద్రాలకు వెళ్తున్నా, వ్యాక్సిన్ఇవ్వడం లేదని పలువురు మండిపడుతున్నారు. మెజార్టీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నదని వివరిస్తున్నారు. గ్రేటర్హైదరాబాద్లోనూ ఈ విధానం కొనసాగుతుండటం గమనార్హం. దీంతో 100 శాతం వ్యాక్సినేషన్ ఎలా సాధ్యమవుతుందని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.
ఫస్ట్ డోస్ కోసం నెలన్నరగా తిరుగుతున్న : బి.సుశీల, మలక్ పేట
అందరికీ వ్యాక్సిన్ వేసే సమయంలో నాకు ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యంగా ఉంటేనే టీకా వేస్తా అన్నారు. ఆ తర్వాత వెళ్లితే జలుబు ఉన్నదని తిప్పి పంపించారు. అప్పటి నుంచి వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్న. కానీ ఎక్కడా ఫస్ట్ డోస్ వేయడం లేదని చెబుతున్నారు. క్యాంప్‌ల్లోనూ సెకండ్ డోసే ఇస్తున్నారు. నేను ఫస్ట్ డోస్ తీసుకోవడానికి గత నెల 15 రోజులుగా తిరుగుతున్న. ఫస్ట్ డోస్‌కు పర్మిషన్ లేదని, సెకండ్ డోస్ మాత్రమే వేస్తామంటున్నారు. ఫస్ట్ టీకా తీసుకోకుండా రెండోది ఎలా తీసుకోవాలి..? వైద్యాధికారులు ఫస్ట్ డోస్ కూడా ఇవ్వాలి.